6, జనవరి 2010, బుధవారం

లెక్క తేలడం లేదు !



పయస్వినీనాం ధేనూనాం
బ్రాహ్మణ: ప్రాప్య వింశతిమ్
తాభ్యోష్టాదశ విక్రీయ
గృహేత్వైకాం గృహం గత:



శ్లోకంలో కవి - ఒక బ్రాహ్మణుడు ఇరవై ఆవులను దానంగా తీసుకుని, అందులో పద్ధెనిమిది ఆవులను విపణి వీధిలోతన జీవిక కోసం అమ్మేసాడని చెబుతున్నాడు. పోనీ లెండి అన్ని ఆవులని అతడేం చేసుకుంటాడు చెప్పండి ? సరే, అలా ఆవులని విక్రయించి, యింటికి కేవలం ఒక్క ఆవుతో చేరాడుట! లెక్క ఎక్కడో తప్పలేదూ? 20 ఆవులని దానంగాతీసుకుని, 18 ఆవులని అమ్మేస్తే యింటికి రెండు (2) ఆవులతో తిరిగి రావాలి కదూ.?
మరేం లేదు ...
బాపడు దానం పట్టిన ఆవులు 20 కాదండీ ... 19 (పందొమ్మిది మాత్రమే) !
శ్లోకంలో ధేనూనామ్ అనే పదాన్ని ... ధేను: , ఊనామ్ అని చదువుకుంటే సరి ! అంటే, ఒకటి తక్కువ ఇరవై అని అర్ధం ! ఊనామ్ అంటే తక్కువ అని అర్ధం కదా?
ఇప్పుడు లెక్క సరి పోయిందోచ్ !

1 కామెంట్‌:

Sandeep చెప్పారు...

ఇన్నాళ్ళూ మీ బ్లాగును చూడలేదండీ. చక్కని పద్యాన్ని వివరించారు. మీరు ఇంకా ఇలాంటి టపలు అనేకం వ్రాయాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి