22, జూన్ 2013, శనివారం

హిమవత్పర్వత సానువుల్లో మును పెన్నడూ ఎరుగని ఘోర విపత్తు సంభవించింది. వేలాది మందిని గంగమ్మ          పొట్టన పెట్టు కుంది. ఆ విపత్తు వివరాలు అందించడంలో మన తెలుగు టి.వి లు అత్యుత్సాహంతో కొంత మదర్యాద కోల్పోతున్నాయి. వాటికి సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడో, చర్చా కార్యక్రమాలు నిర్వహించే టప్పుడో తమ పైత్యం ఒలకబోస్తూ పెడుతున్న పేర్లు అభ్యంతర కరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు నిన్న దానికి చెందిన ఒక కార్యక్రమానికి యమలోకం అని శీర్షిక ఉంచేరు. చర్చలో పాల్గొన్న ఒక పెద్దాయన అది దేవ లోకం కానీ యమ లోకం కాదనీ అసలే ఆ ప్రాంతమంతా అనుకోని ఘోర విపత్తుతో దయనీయంగా ఉంటే ఇలాంటి పేర్లు పెట్టడం తగదని హెచ్చరిండం జరిగింది. అలాగే వరద బీభత్సానికి బదరీనాథ్ అంతా బురద మయమై పోయిందని చెబుతూ ‘‘ బురదీనాథ్’’ అని శీర్షిక ఉంచి తన అతి తెలివిని మరో టీ.వీ. ప్రకటించుకుంది. ఈ జాడ్యం మన వాళ్ళకి వదిలేదెలా ? మీరూ ఆలోచించండి ...

2 కామెంట్‌లు:

www.apuroopam.blogspot.com చెప్పారు...

మన ప్రసార మాధ్యమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.అత్యంత జుగుప్సాకరమైన రీతిలో వార్తల్ని అందించడంలో వారు దిట్టలు.వారే నాడూ వారి సొంత పైత్యం లేకుండా వార్తల్ని అందించరు.పైగా We report you decide అంటారు.నిజానికి నిష్పక్షపాతంగా వారు వార్తల్ని అందిస్తే వాటిలోని మంచి చెడ్డల్నినిర్ణయించుకోవలసినది పాఠకులు
శ్రోతలున్నూ.. కాని వారా పని ఎన్నడూ చేయరు.ఈ వార్తా మాధ్యమాల గురించి చెప్పవలసింది ఎంతో ఉంది. కాని మనమేం చేసినా అదంతా అరణ్య రోదనే అవుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి